బాలయ్య కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్ హీరో

బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. హీరో శ్రీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఇక సినిమాలో మెయిన్ విలన్ కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే మొదటి నుంచి వినిపిస్తున్న బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. ‘బలరామయ్య బరిలోకి దిగితే’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. సింహా, లెజెండ్ సినిమాల రేంజ్ లో ఈ సినిమాని తీర్చిదిద్దే ప్రయత్నంలో బాలయ్య ఉన్నారు. నందమూరి అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు.