రస్మికకు మాటిచ్చిన విజయ్

హీరోయిన్ రష్మిక మందనకు హీరో విజయ్ దేవరకొండ మాటిచ్చాడు. అలాగని అది పెళ్లి మాట, ప్రేమ మాట కాదు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ గురించి నటి రష్మిక స్పందించారు.

‘నాకెంతో సంతోషంగా ఉంది. కిల్లర్‌ పోస్టర్‌..! ఈ మాస్టర్‌ పీస్‌ను వెండితెరపై చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. థియేటర్‌లో సినిమా చూసేరోజు డ్యాన్స్‌ చేస్తూ ఈలలు వేస్తాను. నాకెంతో ఇష్టమైన విజయ్‌దేవరకొండ, పూరీ జగన్నాథ్‌, ఛార్మిలకు ఆల్‌ది బెస్ట్‌’ అని రష్మిక ట్వీట్‌ చేసింది. దీనిపై విజయ్ స్పందించారు.  ‘ఈ సినిమా విడుదలైనప్పుడు థియేటర్‌లోని ఎంతో మంది డ్యాన్స్‌.. కేకలు.. ఈలలు వేస్తారని మాటిస్తున్నా. ఈ విషయం నీకు కూడా తెలుసు ఎందుకంటే నువ్వు కొంత భాగాన్ని చూశావు.’ అని రిప్లై ఇచ్చారు.