#VD10 : టైటిల్.. ఫస్ట్ లుక్ !

పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. అంతేకాకుండా ఫస్ట్‌లుక్‌ను సైతం అభిమానులతో పంచుకుంది. ‘లిగర్’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. బాక్సర్ గా గ్రాండిస్తున్న విజయ్ లుక్ ని ఫస్ట్ లుక్ గా వదిలారు.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌టైనర్ ‘లిగర్’ తెరకెక్కుతోంది. విజయ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి అనన్య పాండే ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బాక్సింగ్‌ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ ఇప్పటికే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు.