బావతో గ్యాప్.. అబ్బాయ్’ని బాబాయ్ దగ్గరకి తీస్తున్నాడా ?
చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపేదెవరు ? అనే దానికి స్పష్టమైన సమాధానం లేదు. చంద్రబాబు వారసడు నారా లోకేష్ కు ఆ అవకాశాలున్నాయి. కానీ ఆయనకు ఆ సమర్థతలేదని ఇప్పటికే క్లారిటీ వచ్చిందని సొంత పార్టీ నేతలే చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జూనియర్ వస్తేనే తెదేపాకు మళ్లీ పూర్వవైభవం వస్తుందనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. మరీ.. తారక్ ని తీసుకొచ్చెదేవరు అంటే ? ఆ బాధ్యతని బాబాయ్ బాలయ్య తీసుకున్నాడని సమాచారమ్.
అలాగని తారక్ పై ప్రేమతో కాదట. బావ చంద్రబాబుపై కోపంతో అని చెబుతున్నారు. ఇది షాకింగ్ ట్విస్టే. కానీ నిజం ఉందని చెప్పుకుంటున్నారు. సోమవారం ఎటీఆర్ 25వ వర్థంతి రోజున బాలయ్య సన్నిహితుల దగ్గర తారక్ గురించి మాట్లాడారట. “ఎప్పటికైనా.. మావాడు ఇక్కడకి రావాల్సిందే కదా” అన్నారట. దీంతో మళ్లీ ఫోకస్ జూనియర్ ఎన్టీఆర్ పైకి వెళ్లిందని చర్చించికుంటున్నారు.
ఇటీవల బాలయ్య బావ చంద్రబాబుపై అలకబూనారనే వార్తలు వినిపించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బాలకృష్ణ అడిగితే బాబు పొలిట్ బ్యూరో తో సరిపెట్టడంపై బాలయ్య గత కొద్ది రోజులుగా గరం గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీయే మా నాన్నది అయినప్పుడు అమధ్యలో బాబు పెత్తనమేంటనే భావనలో బాలయ్య ఉన్నట్లు అతని సన్నిహితుల సమాచారం. అందుకే ఆయన అబ్బాయ్ తారక్ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.