కంగ్రాట్స్.. టీమిండియా !

టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆఖరిదైన నాల్తో టెస్టులో టీమిండియాను 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట్లో యువ ఓపెనర్ (91), చివరలో పంత్ (89*) అద్భుతంగా ఆడి జట్టుని ముందుకు నడిపించారు. విజయాన్ని అందించారు. వీరికి పుజారా 59, రెహానె 24, సుందర్ 22 సాయం అందించారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా సొంత గడ్డపై 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెల్చుకుంది. టీమిండియా చరిత్ర సృష్టించింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా టీమిండియాకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. ప్రధాని నరేంద్ర మోడీ టీమిండియాకు అభినందలు తెలిపారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ‘కంగ్రాట్స్ టీమిండియా’ అంటూ శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. మొత్తానికి.. ఈ చారిత్రాత్మక విజయంతో దేశం మురిసిపోతోంది.