బ్రేకింగ్ : నాల్టో టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయం
ఆస్ట్రేలియా గెలుపు కోట బ్రిస్బేన్‌లో.. టీమిండియా గెలుపొందింది. ఆసీస్ నిర్ధేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని 7వికెట్లు కోల్పోయి చేధించింది. యువ ఓపెనర్ శుభమన్ గిల్ 91, రిషబ్ పంత్ 89*, పుజారా 56, రెహానె 24, సుందర్ 22 పరుగులతో రాణించారు. 1988 తర్వాత బ్రిస్టేన్ లో ఆసీస్ ఓడటం ఇదే తొలిసారి. అదికూడా పూర్తిస్థాయి యువకులతో కూడిన టీమిండియా జట్టుపై ఓడటం గమనార్హం.
బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు గెలుపు కోట లాంటిది. ఇక్కడ ఆ జట్టు ఆడిన గత 55 టెస్ట్ మ్యాచ్‌ల్లో 33 గెలిచింది. 13 డ్రా కాగా, ఒక మ్యాచ్ టై అయ్యింది. 8 టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి చవిచూసింది. 1988 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఓడలేదు. ఈ గెలుపుతో టీమిండియా బెంచ్ బలం ఏంటన్నది తెలిసిందని చెప్పవచ్చు.