#RRR రిలీజ్.. ఎక్స్ క్లూజివ్ అప్ డేటు !

#RRR షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. క్లైమాక్స్ షూటింగ్ మొదలైందని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో.. #RRR రిలీజ్ ఎప్పుడు అనే చర్చ మొదలైంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం.. ఇప్పటి వరకు #RRR షూటింగ్ 80% పూర్తయింది. 20% షూటింగ్ మాత్రమే మిగిలివుంది. క్లైమాక్స్ తో పాటు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. 

మొత్తంగా నాలుగు పాటలు ఉన్నాయి. మరో పాటని కూడా జక్కన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దసరా కానుకగా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారట. వీలైనంత త్వరగా మిగిలివున్న 20శాతం షూటింగ్ ని పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం తీసుకోనేలా ప్లాన్ చేసుకుంటున్నారట. దసరా వరకు వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడవడంతో పాటు.. ప్రజల్లో కరోనా పట్ల భయం కూడా పోతుందని భావిస్తున్నారట.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. స్వాత్రంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య గల ఓ కామన్ పాయింట్ ఆధారంగా దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కథని రాసుకొన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక కొమరంభీమ్ పాత్రలో తారక్.. ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.