ప్రియుడు, పెళ్లి గురించి చెప్పేసిన తాప్సీ !
సొట్టబుగ్గల సుందరి తాప్సీకి టాలీవుడ్ కలిసిరాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణిస్తోంది. అక్కడ విభిన్నమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. అలాగని సౌత్ ని మరచిపోలేదు. తెలుగు, తమిళ్ లోనూ ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. సినిమాలే కాదు.. పర్సనల్ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.
అప్పుడప్పుడు మథియాస్ తో వెకేషన్లకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో
పాల్గొన్న తాప్సీ ప్రియుడు, పెళ్లి గురించి ఆసక్తికర ముచ్చట్లు చెప్పింది. అవి ఆమె మాటల్లోనే.. “ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేట్ చేయడం నాకిష్టం లేదు. నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు వేర్వేరు. నాకు సంబంధించిన వారి పుట్టినరోజుల్లో పాల్గొన్నపుడు ఏదో ఒక స్టిల్ ను పంచుకుంటాను. నా పర్సనల్ లైఫ్ లో భాగమైన మథియాస్ విషయంలో అదే చేశా”నని చెప్పుకొచ్చింది.
పెండ్లి ప్లాన్ గురించి మాట్లాడుతూ.. “నేను ఏదో ఒకసారి ఐదారు సినిమాలు చేయడానికి బదులు రెండుమూడు సినిమాలే చేయడంపై దృష్టిపెడతాను. అప్పుడే నా వ్యక్తిగత జీవితం కోసం సమయాన్ని కేటాయించే అవకాశం దొరుకుతుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని, సినిమాలు తగ్గించాలనుకున్న తర్వాత పెండ్లి గురించి ఆలోచిస్తా”నని చెప్పింది.