ఇక్కడ.. పడుకోనిదే పనులు జరగవ్ !

ఐస్ క్రీమ్ పాప తేజస్వీ మడివాడ బోల్డ్  నెస్ గురించి తెలిసిందే. ఆమె బోల్డ్ గా కనిపించడమే కాదు.. ఆమె మాటలు అలాగే ఉంటుంది. ఇండస్ట్రీలో  కాస్టింగ్ కౌచ్ ధైర్యంగా మాట్లాడే తేజస్వీ.. తాజాగా మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. టాలీవుడ్‌లో తనను చాలా మంది కమిట్మెంట్ అడిగారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 90 శాతం ఇక్కడ పడుకోనిదే పనులు జరగవని చెప్పింది.

తనకు ఆ మధ్య బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఓ వెబ్ సిరీస్‌లో నటించే ఆఫర్ వచ్చినా కూడా అందులో నగ్నంగా నటించాలని కోరడంతో నో చెప్పినట్లు చెప్పింది తేజస్వీ. ఈ తెలుగమ్మాయి. ప్రస్తుతం లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో కమిట్మెంట్ అనే సినిమా‌లో నటించింది. ఈ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా ఓపెన్ అయింది.

‘కమిట్‌మెంట్’ సినిమా టీజర్ ఆ మధ్య విడుదలైంది. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో  ‘కమిట్‌మెంట్’ తెరకెక్కింది. అమ్మాయిలకు సినిమా అవకాశం రావాలంటే బెడ్రూమ్‌కు రావాల్సిందే సబెక్ట్ తోనే కమిట్ మెంట్ తెరకెక్కింది. ఇది తనకు దగ్గరగా ఉన్నకథ అని తేజస్వీ చెప్పడం విశేషం.