‘గని’గా గద్దలకొండ గణేష్

‘గద్దలకొండ గణేష్’గా కనిపించి మాస్ హిట్ కొట్టాడు మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ బ్లాక్ బస్టర్  హిట్టైన సంగతి తెలిసిందే. మరోసారి తేజు గణేష్ గా షార్ట్ ఫామ్ లో ‘గని’గా కనిపించబోతున్నారు. సాయి కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు.

ఇందుకోసం బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ‘గని’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. వరుణ్ తేజ్ పంచ్ ఇస్తున్న సీన్ తో మోషన్ పోస్టర్ ని కూడా వదిలారు. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కుతోంది. వరుణ్‌కు జోడిగా ప్రముఖ హిందీ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.