ఆఖరి రోజు : 73 మందికి ట్రంప్ క్షమాభిక్ష

అగ్రరాజ్య అమెరికా కొత్త అధ్యక్షుడిగా రేపు జో బైడన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 73 మందికి క్షమాభిక్ష పెట్టారు. మరో 70 మందికి శిక్షను తగ్గించారు.

స్వీయ క్షమాభిక్షకు మాత్రం ట్రంప్ మొగ్గుచూపలేదు. అలాగే తన కుటుంబ సభ్యులను కూడా ఈ జాబితాలో చేర్చలేదు. శ్వేతసౌధం మాజీ ఉన్నతాధికారి స్టీవ్‌ బ్యానన్‌ సహా మొత్తం 73 మందికి ట్రంప్‌ క్షమాభిక్ష పెట్టారు. సాధారణంగా కనీసం కొన్ని నెలల పాటు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష ప్రసాదిస్తారు. బ్యానన్‌ విషయంలో మాత్రం అది జరగలేదు. ఆయన ఇటీవలే జైలుకు వెళ్లారు. కనీస శిక్షాకాలాన్ని పూర్తి చేయకముందే ఆయనను ట్రంప్‌ క్షమించేశారు.