మెగాస్టార్ తో క్రాక్.. కిర్రాక్ !

క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేనికి మెగా పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ నే తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి క్రాక్ సినిమాని చూశారు. సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ తనకి ఫోన్ చేసి అభినందించారు. అంతేకాదు.. ఓ సారి ఇంటికొచ్చి కలవమమన్నారని చెప్పారు. తాజాగా గోపీచంద్ మలినేని మెగాస్టార్ ని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ‘క్రాక్’ రిలీజ్ తర్వాత మెగా పవర్ స్టార్ తో గోపీచంద్ మలినేని ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల చరణ్ ని కలిసిన గోపీచంద్ ఓ కథని వినిపించారని.. అది ఆయనకు నచ్చిందని చెప్పుకున్నారు. చరణ్ తో కాకపోయినా.. మెగా హీరోల్లో ఒకరితో గోపీచంద్ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ? మాస్ కథలు అంటే మెగాస్టార్ కు ఇష్టమన్న సంగతి తెలిసిందే.