షాకిస్తున్న మహేష్ లుక్

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా కోసం మహేష్ కొత్త లుక్ లోకి మారిపోయారు. పొడవాటి జుట్టుతో మరీ.. సన్నగా మారిపోయాడు మహేష్. యంగ్ ఏజ్ లో మహేష్ బాబు లా కనిపిస్తున్నాడు. ఇప్పుడీ.. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా మహెష్ టీనేజ్ కుర్రాడిగా మారిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

బ్యాంకిగ్ రంగంలో జరిగే ఆర్థిక నేరాల నేపథ్యంలో సర్కారు వారి పాట తెరకెక్కతోందని తెలుస్తోంది. బలమైన ఎమోషన్స్ కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని మహేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ కి  జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకొచ్చే ఆలోచనలు కూడా చేస్తున్నారని సమాచారమ్.