ఏపీలో మరో వింత వ్యాధి.. పూళ్ల గ్రామంలో భయానక పరిస్థితి !

ఏపీలో మరో వింత వ్యాధి వణికిస్తోంది. ఇటీవల ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో వందలాది మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మరో వింత వ్యాధి కలకలం రేపుతోంది. భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో రెండ్రోజులుగా యువకులు, మహిళలు ఉన్నట్టుండి మూర్చవచ్చి పడిపోతున్నారు. వీరి సంఖ్య 28కి చేరింది. రోజురోజూకి ఈ వింత వ్యాధి బారీన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ వింత వ్యాధిపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఈ వ్యాధి వల్ల ప్రాణాపాయం లేదన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వైద్య బృందాలు పూళ్ల గ్రామానికి చేరుకొని.. వాటర్, ఆహారపదార్థాల శాంపిల్స్ సేకరించాయని.. వాటిని పరెక్షించి ఈ వింత వ్యాధికి గల కారణాలని తెలియజేస్తారని తెలిపారు.