ప్రదీప్ సినిమాకు ప్రమోషన్స్ కరువు

యాంకర్’గా ప్రదీప్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా మారితే ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ గా నిలిచింది. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమాతో ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించారు. ప్రదీప్ కి  జంటగా అమృతా అయ్యర్ జతకట్టింది. కన్నడ నిర్మాత ఎస్వీ బాబు నిర్మించారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా..’ సాంగ్ సూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. రిలీజ్ కి ముందే హైప్ తెచ్చుకున్న ప్రదీప్ సినిమా రిలీజ్ కి కరోనా బ్రేక్ వేసింది. ఎట్టకేలకు ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్స్ మొదలెట్టలేదు. ఇప్పటికే సినిమా జనాల్లోకి వెళ్లిందనే ధీమానా ? లేక.. మరేమైనా ఆర్థిక సమస్యలున్నాయా ?? అనేది మాత్రం తెలియరాలేదు.