విజయ్’తో పూజా హెగ్డే రొమాన్స్


కోలీవుడ్ చిత్రం ‘ముగముది’తో తెరకు పరిచయం అయింది. ఈ సినిమా తెలుగులో ‘మాస్క్’గా విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. బాలీవుడ్ కు వెళ్లొచ్చింది. అయితే ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’తో పూజా కేరీర్ టర్న్ అయింది. టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల పక్కన రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలొచ్చాయ్. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ.. బిజీగా గడుపుతోంది బుట్టబొమ్మ.

ఈ నేపథ్యంలో ఈ బ్యూటీకి కోలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్టు సమాచారమ్. ‘మాస్టర్‌’ తర్వాత విజయ్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌ను నెల్సన్‌ దిలీప్‌కుమార్‌తో చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్‌ 65వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజాహెగ్డేను కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ మేరకు ఇప్పటికే దర్శకుడు నెల్సన్‌ ఆమెతో సంప్రదింపులు జరిపారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరీ.. బొద్దు అందాలని ఇష్టపడే తమిళ ప్రేక్షకులు పూజా స్లిమ్ అందాలని ఫిదా అవుతారా ? అన్నది చూడాలి.