ఇలా స్టెప్పులేయడం కన్నా.. కన్నుకొట్టడమే ఈజీ !
కన్నుగీటేసి రాత్రికి రాత్రే స్టార్ డమ్ సొంతం చేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. అలాంటి ప్రియా ప్రకాష్.. ఓ స్పెషల్ సాంగ్ చేసిందంటే.. ఏ రేంజ్ లో ఉండాలి. అదిరిపోవాలి. ఆ రెస్పాన్స్ తో మరోసారి ఆమె పేరు మారుమ్రోగిపోవాలి. కానీ అలా జరగలేదు. రోహిత్ నందన్, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం ‘లడిలడి’ అనే పాట రూపొందింది.
ఈ పాటకు శ్రీచరణ్ పాకాల స్వరాలు అందించగా.. ‘బిగ్ బాస్ 3’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాటకు రఘు మాస్టర్ డ్యాన్స్ సమకూర్చారు. ఈ పాటని ఇటీవల విడుదల చేశారు. అయితే ఈ పాట కోసం ప్రియా ప్రకాష్ వారియర్ ఒంపు సొంపులకి సరిగ్గా వాడుకోలేదు. ఫోకస్ అంతా.. రోహిత్ నందన్ పైనే పెట్టారు. అతడిలోని డ్యాన్స్ టాలెంట్ ని చూపించే ప్రయత్నం చేశారు. కానీ ప్రియా గ్లామర్ ని వాడుకోలేదు. డ్యాన్సులోనూ ఆమె తేలిపోయింది. దీంతో.. డ్యాన్స్ కంటే.. మరోసారి కన్నుకొట్టడమే బెటరని ఆమె అనుకుంటున్నట్టు సమాచారమ్.