హిట్ కిక్’లో.. హీరోయిన్స్’తో లిప్ లాక్’లట !

మాస్ మహారాజ రవితేజ క్రాక్ హిట్ కిక్కుల్లో ఉన్నాడు. ఈ కిక్కులో హీరోయిన్స్ పెదాలని జుర్రేసుకుంటున్నాడట. అదికూడా బాలీవుడ్ హీరోయిన్స్ తో కానిచ్చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే ? ‘క్రాక్’ రిలీజైన వెంటనే తన తదుపరి సినిమా ‘ఖిలాడి’ షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు రవితేజ. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు.బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ మినాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ విశాఖపట్నంలో జరుగుతోంది. అక్కడ హీరో-హీరోయిన్ ల మధ్య ఓ ఘూటైన ముద్దు సీన్ చిత్రీకరించారట. హీరోయిన్స్ పెదాలని రవితేజ జుర్రేసుకున్నారట. అలాంటి ఇలాంటి కిస్ సీన్ కాదు. ఇంగ్లీష్ ముద్దు. హాలీవుడ్ సినిమాలో రేంజ్ లో ఉంటుందట. ఇలాంటి కిస్ సీన్ ఇంకోటి కూడా ఉండనుందట. అది కూడా త్వరలోనే షూట్ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి.. క్రాక్ హిట్ కిక్కులో ఉన్న రవితేజ.. హీరోయిన్స్ కి లిప్ లాక్ లు ఇస్తున్నారన్న మాట.