గ్రేట్ : కలెక్షన్స్’కి నో రెడ్ సిగ్నల్

ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా హిట్టైంది.. అంటే అది కచ్చితంగా హీరో క్రెడిట్ నే. ‘రెడ్’ సినిమా విషయంలో అదే  జరుగుతోంది. రామ్-కిషోర్ తిరుమల కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘రెడ్’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రెడ్ మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. రామ్ వన్ మేన్ షో చేశారు. కొన్ని ఏపీసోడ్స్ బాగానే ఉన్నాయ్. కానీ ఓవరాల్ గా రెడ్ యావరేజ్ అనే టాక్ వినిపించింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా రెడ్ కలెక్షన్స్ లో దూసుకెళ్తోంది.

మొదటి రోజే దాదాపు 5 కోట్లు రాబట్టి రామ్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఇక నాలుగు రోజుల్లో 22.70 కోట్ల గ్రాస్ రాబట్టిందని.. ఐదో రోజు 1.16 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్స్ వర్గాలు చెప్తున్నాయి. నాలుగు రోజులు కలిపి వరల్డ్ వైడ్ గా 22.70 కోట్ల గ్రాస్.. 13.59 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే  ఐదవ రోజు మొత్తం 1.16 కోట్ల షేర్ ని రాబట్టింది.  ఐదు రోజుల్లో 14.75 కోట్ల షేర్ తీసుకొచ్చింది. వీటిలో నైజాం- 4.90 కోట్లు, సీడెడ్- 2.45 కోట్లు, ఆంధ్రా – 5.75 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. పోటీలో క్రాక్ తప్ప మరో సినిమా లేదు. ఈ నేపథ్యంలో రెడ్ కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయమని చెబుతున్నారు.