వరుణ్ ధావన్ పెళ్లి ఆహ్వానితుల లిస్టు.. ఇదే !

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల ప్రేయసి నటాషా దలాల్నుని పెళ్లాడనున్నాడు. ఈ నెల 24నే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అప్పుడే పెళ్లి పత్రికలు కూడా వచ్చేశాయ్. వాటిని పంచే పనిలో వరుణ్ ధావన్ ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్స్ కి వీరి పెళ్లి ఆహ్వానాలు అందాయట. అయితే పరిమిత సంఖ్యలో ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పెళ్లి విందుకు మాత్రం అందరినీ ఆహ్వానిస్తున్నారట.

వరుణ్ ధావన్-నటాషాల పెళ్లి ఆహ్వానం అందుకున్న బాలీవుడ్ ప్రముఖుల్లో.. షారుఖ్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ లతో పాటు క‌ర‌ణ్‌జోహార్‌, శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంప‌తులు, డైరెక్ట‌ర్ రెమో డిసౌజా, శ‌శాంక్ కైతాన్ హాజ‌ర‌వ‌నున్నార‌ని తెలుస్తోంది.  ఇక జనవరి 26న వివాహ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు అందరు ఆహ్వానితులే అన్నట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారట.