ట్రైలర్ టాక్ : 30రోజుల్లో ప్రేమించడం ఎలా ?
యాంకర్’గా ప్రదీప్ హీరోగా మారి చేసిన సినిమా ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించారు. ప్రదీప్ కి జంటగా అమృతా అయ్యర్ జతకట్టింది. కన్నడ నిర్మాత ఎస్వీ బాబు నిర్మించారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసే బాధ్యతను యువి/గీతా సంస్థలు టేకప్ చేశాయి. సినిమా ప్రచారాన్ని కూడా మొదలెట్టాయి. తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ఇప్పటికే సూపర్ హిట్టైనా.. ‘నీలి నీలి ఆకాశం.. ‘ పాటతో ట్రైలర్ మొదలైంది. కాలేజ్ ఏపీసోడ్, ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్స్ ని చూస్తుంటే.. ఇదో పునర్జన్మల కథ అనిపిస్తుంది. మగధీర లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే గుర్రాలు, కత్తి యుద్ధాలు మాత్రం లేవు. సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ట్రైలర్ ని కట్ చేశారు. నీలి నీలి ఆకాశం పాట ఉన్నంత బాగా సినిమా ఉంటుందని చెబుతున్నారు.