ఫేక్ ప్రచారం : కరోనా వాక్సిన్’తో 7 లక్షల మరణాలు

దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వాక్సిన్ తీసుకొన్ని కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నారు. కొందరు వాక్సిన్ తో మృతి చెందారన్న వార్తలు కూడా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వాక్సిన్ తో దాదాపు 7లక్షల మంది మృతి చెందుతారనిమైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అన్నారంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో వాక్సిన్ తీసుకొనేందుకు జనాలు జంకుతున్నారు. ఇప్పటి వరకు వాక్సిన్ తీసుకోవాలని అనుకున్నవారు కూడా ఈ ప్రచారం చూసి వెనకడుగు వేస్తున్నారు. అయితే బిల్ గేట్స్ మీద జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు.

అసలు కరోనా వాక్సిన్ తీసుకుంటే మృతి చెందుతారని బిల్ గేట్స్ ఎక్కడా చెప్పలేదు. చాలా బాధ్యతగా వ్యవహరించే బిల్ గేట్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనుకోవడం  కూడా పొరపాటే. టీకా తీసుకోవడం వల్ల సుమారు ఏడు లక్షల మందికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందని మాత్రమే బిల్ గేట్స్ అన్నారు. కానీ 7 లక్షల మంది మృతి చెందుతారని చెప్పలేదు. టీకా తీసుకుంటే.. దురద లాంటిది రావడం సహజమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇతర వ్యాధుల టీకాల విషయంలోనూ ఇలాంటి స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు.