అఫీషియల్ : సీఎంగా కేటీఆర్.. వచ్చే నెలలోనే !
మంత్రి కేటీఆర్’కు పట్టాభిషేకం… ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే టాపిక్. గత కొద్దిరోజులుగా మంత్రి కేటీఆర్ సీఎం కాబోతున్నారనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అది నిజమే అన్నట్టుగా తెరాస మంత్రులు సీఎం పదవికి కేటీఆర్ అర్హుడని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడీ ఈ జాబితాలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షయంలో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. అతి త్వరలోనే సీఎం బాధ్యతలు స్వీకరించబోతున్నారని ప్రకటించారు. దీంతో. కేటీఆర్ సీఎం కాబోతున్నారని అధికారికంగా ప్రకటించినట్టయింది.
సికింద్రాబాద్‌లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ.. కార్మికుల తరపున, తెలంగాణ శాసనసభ తరపున కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రకటించారు. త్వరలోనే ఆయన సీఎం అవుతారని ప్రకటించారు.