ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు లెటెస్ట్ ప్రకటన

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పెళ్లి చేయాలని ఆయన పెద్ద నాన్న, సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు బాగానే ట్రై చేశారు. గతంలో కృష్ణంరాజుని ఎప్పుడు అడిగినా.. త్వరలోనే ప్రభాస్ పెళ్లి అనేవాడు. బాహుబలి నుంచి ఇదే జరుగుతోంది. బాహుబలి రిలీజైన తర్వాత మాత్రం ప్రభాస్ పెళ్లి విషయంలో కృష్ణంరాజు స్వరం మారింది. ప్రభాస్ పెళ్లెప్పుడు ? అని అడిగితే.. అది వాడినే అడగండీ ? అంటూ చేతులెత్తేశాడు. ఇప్పుడైతే.. ప్రభాస్ పెళ్లా.. ? ఎప్పుడు చేసుకుంటే అప్పుడే అంటున్నాడు.

బుధవారం కృష్ణంరాజు బర్త్ డే సందర్భంగా మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి ఆయన్ని అడిగింది. దానికి ఆయన.. ఎప్పుడు చేసుకుంటే అప్పుడే అని షాకింగ్ సమాధానం చెప్పాడు. దీంతో.. ప్రభాస్ ని కృష్ణంరాజు వదిలేశాడని స్పష్టత వచ్చినట్టయింది. ఇక ప్రభాస్ మాత్రం పెళ్లి ధ్యాస లేకుండా వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్న ప్రభాస్.. సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలని పూర్తి చేయనున్నారు. ఇక ప్రభాస్ ప్రియురాలుగా ముద్రపడిన స్వీటీ అనుష్క కూడాపెళ్లి ఊసే ఎత్తడం లేదు. సినిమాలు తగ్గించేసి.. గుళ్లు-గోపురాలు తిరుగుతోంది. బహుశా.. ఈ ఇద్దరు ముదుర్లు మరింత ముదిరాక పెళ్లి చేసుకుంటారేమో.. !

ఇక సీనియర్ రెబల్ స్టార్ విషయానికొస్తే.. ఆయనకి గవర్నర్ గిరి దక్కనుంది. తమిళనాడు గవర్నర్ గా ఆయన్ని నియమిస్తారేనే ప్రచారం జరుగుతోంది.