ముఖ్యమంత్రి పదవి : కేటీఆర్’కు ఎస్సీ నాయకుడు పోటీ !?

మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అది కూడా వచ్చే నెలలోనే. ఫిబ్రవరి 18న ముహూర్తం కుదిరింది అనే ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారం నిజమే అన్నట్టుగా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు.. మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా అర్హుడు. సమర్థుడని కితాబిస్తున్నారు. అంతా ఒకే మాట మీద ఉంటున్నారు. దీంతో.. సీఎంగా కేటీఆర్ కు పోటీ లేదన్నది స్పష్టం. తెలంగాణకు రెండో సీఎంగా కేటీఆర్ కావడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ వన్ సైడ్ టాక్ లోనూ మంత్రి కేటీఆర్ కు ఎస్సీ నాయకుడు పోటీకి వస్తున్నారు. అంత ధైర్యం చేసిన ఆ ఎస్సీ నాయకుడు ఎవరు అంటే.. ?

గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన నేతనే. అవునూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో.. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఎస్సీ నాయకుడుని చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాట తప్పాడు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే నిలిచారు. ఎస్సీ నాయకుడుతో పాటు బీసీ నేత, మహిళా నేతకు తెలంగాణ సీఎం పోస్ట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది.

అయితే అదంతా.. ఉద్యమ లెక్క. ఉద్యమ వ్యూహాం, రాజకీయం.. అన్నట్టుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన తర్వాత అయినా.. రెండో ముఖ్యమంత్రిగా దఌతుడిని సీఎం చేస్తాడనుకుంటే.. ? ఆయన తనయుడు కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తుండు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా… ఈ సారైనా కేసీఆర్ కు దఌతుడు గుర్తురావట్లేదా ? అని సటైర్స్ వేస్తున్నారు. దీంతో అసలే పోటీలేని కేటీఆర్ కు ఎస్సీ నాయకుడు పోటీలోకి వచ్చినట్టయింది.