ప్రదీప్ సినిమాని టేకప్ చేసిన యువి/గీతా

యాంకర్’గా ప్రదీప్ హీరోగా మారి చేసిన సినిమా ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’. ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించారు. ప్రదీప్ కి  జంటగా అమృతా అయ్యర్ జతకట్టింది. కన్నడ నిర్మాత ఎస్వీ బాబు నిర్మించారు. ఈ సినిమాకు స్టార్ హీరోలు సపోర్ట్ చేశారు. ఫస్ట్ లుక్ ని రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజైన ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా..’ సాంగ్ సూపర్ హిట్ అయింది. యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది.

అయితే రిలీజ్ కి ముందే హైప్ తెచ్చుకున్న ప్రదీప్ సినిమా రిలీజ్ కి కరోనా బ్రేక్ వేసింది. ఎట్టకేలకు ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మళ్లీ మొదటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసే బాధ్యతను యువి/గీతా సంస్థలు టేకప్ చేసినట్లు తెలుస్తోంది. గీతా/యవి టేకప్ చేసాయి అంటే.. ప్లానింగ్ పెర్ ఫెక్ట్ గా వుంటుంది. మంచి థియేటర్లు పడతాయి.అందుకే ప్రదీప్ అండ్ టీమ్ హ్యాపీగా ఉన్నారు. ప్రమోషన్స్ అంటూ పెద్దగా హడావుడి కూడా చేయడం లేదు.