జగ్గారెడ్డి స్వరం మారిందేంటీ ? తెరాసలో చేరుతారా ??

రాజకీయాలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. ఇప్పుడు.. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ లైన్ ఫాలో అవుతున్నారు. తాజాగా ఆయన సీఎం కేసీఆర్ కాస్త సపోర్ట్ మాట్లాడటం విశేషం. సీఎం కేసీఆర్ ని  జైల్లో పెడతామని బండి సంజయ్ అంటుంటాడు. కానీ ఆయన చేసిన తప్పేంటో మాత్రం చెప్పడు అని అడుకొచ్చాడు. తెరాస నేతలు కూడా సీఎం కేసీఆర్ చేసిన తప్పేంటీ ? ఆయన్ని ఎందుకు జైల్లో పెడతారని అడగరని అన్నారు.

మొత్తానికి తెరాస, భాజాపా, ఐఎంఐ పార్టీలది పాల్లోళ్ల పంచాయితీల ఉంటది. పొద్దునంతా తిట్టుకుంటారు. రాత్రి అయితే కలిసి కల్లు తాగుతారు.అంతేకాదు. ప్రాంతీయ పార్టీల్లో కొడుకును సీఎంని చేసే సాంప్రదాయమే ఉంటుందన్నారు. పరోక్షంగా కేటీఆర్ సీఎం కావడాన్ని జగ్గారెడ్డి సపోర్ట్ చేశారు. మొత్తానికి తెరాస, సీఎం కేసీఆర్ పట్ల జగ్గారెడ్డిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బహుశా… సీఎం కేటీఆర్ సమక్షంలో జగ్గారెడ్డి తెరాసలో చేరుతారేమో చూడాలి.