కరోనా ఫ్రీ భారత్ ఎప్పటికీ.. ?
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 14,256 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయ్. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,39,684కి చేరింది. గడిచిన 24 గంటల్లో 152 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దాంతో మృతుల సంఖ్య 1,53,184కి చేరింది.
ఎప్పటిలాగే రికవరీ కేసుల్లో పెరుగుదల, క్రియాశీల కేసుల్లో తగ్గుదల కొనసాగింది. ప్రస్తుతం దేశంలో 1,85,662 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.78శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 17,130 మంది కరోనా నుంచి కోలుకోగా..ఇప్పటివరకు 1,03,00,838 (96.78శాతం)మంది వైరస్‌ను జయించారు. మరోవైపు దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ కార్యక్రమం దిగ్విజంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12 లక్షల మందికి వాక్సిన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా ఫ్రీ భారత్ ఎప్పుటికల్లా చూడబోతున్నామనే ఆసక్తి నెలకొంది. ప్రపంచ దేశాల్లో కొత్తరకం వైరస్ ప్రభావం గట్టిగా ఉన్నా.. మనదేశంలో మాత్రమే కరోనా అదుపులోనే ఉంది.
ఇక గడిచిన 24 గంతల్లో తెలంగాణలో కొత్తగా 221 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,93,056కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,588కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 431 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,87,899కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,569 ఉండగా వీరిలో 1973 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.