బీసీసీఐకి రవిశాస్త్రి హెచ్చరిక 

ఆసీస్ టూర్ దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చింది టీమిండియా. దీంతో టీమిండియా ఆటగాళ్లకి ఘన స్వాగతం పలికింది. అయితే ఆసీస్ టూర్ కి బయలుదేరే ముందే.. పెద్ద తతంగమే జరిగిందట. ఆసీస్ టూర్ కి ఆటగాళ్ల కుటుంబాలను అనుమతించమని బీసీసీఐ అధికారులు సడెన్ గా చెప్పారట. దీంతో రంగంలోకి దిగిన చీఫ్ కోచ్ రవిశాస్త్రీ..  బీసీసీఐ అధికారులతో చర్చించి ఒప్పించారట. ఈ విషయాన్ని తాజాగా అశ్విన్ తో ముచ్చటించిన ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్ తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ఆటగాళ్ల కుటుంబాలను అనుమతించమని బీసీఐ అధికారులు చెప్పారు. దాంతో తాము అసలు ఆస్ట్రేలియాకే వెళ్లమని, ఏం కావాలంటే అది చేసుకోమని శాస్త్రి బీసీసీఐ అధికారులకు గట్టి హెచ్చరికలు పంపారని శ్రీధర్ తెలిపారు.చివరికి బీసీసీఐ.. క్రికెట్‌ ఆస్ట్రేలియాను ఒప్పించడంతో అక్కడి అధికారులు అప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేశారని శ్రీధర్‌ గుర్తుచేసుకున్నారు. యూఏఈలో ఐపీఎల్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా ఆటగాళ్లు 48 గంటలు క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు.