మెగాస్టార్ ని కలిసిన సోహెల్

బిగ్ బాస్ ఫేమ్ సోహల్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి దంపతులని కలిశారు. రెండ్రోజుల క్రితం నాగార్జునను కలిసిన సొహెల్.. తాజాగా చిరంజీవి ఇంటికి వెళ్లాడు. రెండు గంటల పాటు అక్కడ గడిపాడు. మెగాస్టార్‌తోపాటు ఆయన భార్య సురేఖ, తల్లి అంజనా దేవితో కలిసి ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో మూడో స్థానంలో నిలిచిన సోహెల్.. ప్రేక్షకుల మన్నలని పొందారు. చాలా తెలివిగా గేమ్ ఆడిన సోహెల్ మెగాస్టార్ ని ఫిదా చేశాడు. సోహెల్ చేయబోయే సినిమాకు సపోర్ట్ చేస్తానని మెగాస్టార్ బిగ్ బాస్ వేదిక సాక్షిగా మాటిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించడానికి కూడా ఓకే చెప్పారు. అంతేకాదు.. సోహెల్ కోసం మెగాస్టార్ సతీమణి సురేఖ స్వయంగా బిర్యానీ వండి పంపించిన సంగతి తెలిసిందే.