వావ్.. సలార్’లో విజయ్ సేతుపతి !

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బాహుబలి ప్రభాస్ నటించినున్న చిత్రం ‘సలార్’. ఇందులో విలన్‌ పాత్రకోసం సేతుపతిని సంప్రదించారని సమాచారమ్. ‘సలార్‌’కు సేతుపతి ప్లస్‌ అవుతాడని ప్రశాంత్‌ నీల్‌ భావించారట. సేతుపతి ఇప్పటికే అంగీకరించిన ప్రాజెక్ట్‌లకు ఇబ్బంది లేకుండా షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఏకబిగిన నెల రోజుల్లో సింగిల్‌ షెడ్యూల్‌లో ప్రభాస్‌, సేతుపతి పాత్రలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తిచేస్తారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చని చెబుతున్నారు.

విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం ‘లాభం’ విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో ‘మామానిథాన్‌’, ‘కాత్తువాకుల రెండు కాధల్‌’.. బాలీవుడ్‌లో ‘ముంబైకర్‌’, ‘గాంధీ’ చిత్రాల్లో సేతుపతి నటిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ మాస్టర్ ప్లాప్ అయింది. అయితే ఇందులో విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతికి మంచి గుర్తింపు వచ్చింది. విలన్ పాత్ర అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఒదిగిపోయారు విజయ్ సేతుపతి.