అన్నా రాంబాబు సవాల్ ని పవన్ స్వీకరిస్తారా ?

జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్యకి వైసీపీ ఎమ్మెల్యే కారణమని జనసేన ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శనివారం పవన్ కల్యాణ్ వెంగయ్య కుటుంబాన్నిపరామర్శించారు. ఆర్థిక సాయం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు తీవ్ర హెచ్చరికలు చేశారు. అన్నారాంబాబు మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చూసుకొనే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. పవన్ హెచ్చరికపై తాజాగా అన్నారాంబాబు స్పందించారు. 

వెంగయ్యనాయుడు ఆత్మహత్య తనకు సంబంధం లేదన్నారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వబోమని పవన్ అంటున్నారు.. తానే రాజీనామా చేసి వస్తా.. చూసుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. బై ఎలక్షన్ వస్తే మా నాయకుడు జగన్ కూడా ప్రచారానికి రారు… ఆయన ఫొటో, దివంగత వైఎస్సార్ ఫొటో పెట్టుకుని నేనే ప్రచారం చేసుకుంటా. ఒకవేళ పవన్ గెలిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమే. ఒకవేళ ఆయన ఓడితే జనసేన పార్టీని మూసేస్తారా ?? అని ప్రశ్నించారు. మరీ.. అన్నా రాంబాబు సవాల్ కి పవన్ సై అంటారా ? అన్నది చూడాలి.