ఆసీస్ కెప్టెన్’పై అశ్విన్ సటైర్

ఆటతోనే కాదు.. మాటతోనూ దూకుడు చూపిస్తున్నాడు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. తాజాగా టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ తో చాట్ చేసిన వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ పై అశ్విన్ సటైర్ వేశాడు. ఆసీస్ పై టీమిండియా టెస్టు సిరీస్ ను గెలుచుకోవడం వెనుక టిమ్ పైన్ సాయం కూడా ఉంది. బ్రిస్బేన్ టెస్టు.. రెండో ఇన్నింగ్స్ లో పంత్ ను స్టంపింగ్ చేసే అవకాశాన్ని జారవిడిచాడు.

ఆ పొరపాటే తమను గెలిపించిందని అశ్విన్ వివరించాడు. అందుకే పైన్ అంటే తనకు ఇష్టమని ఎద్దేవా చేశాడు. అంతకుముందు సిడ్నీ టెస్టులో అశ్విన్, టిమ్ పైన్ మధ్య స్లెడ్జింగ్ చోటుచేసుకుంది. బ్రిస్బేన్ కు రా చూసుకుందాం అని పైన్ సవాలు విసరగా, నువ్వు భారత పర్యటనకు వస్తే అదే నీకు ఆఖరి సిరీస్ అవుతుంది అని అశ్విన్ ప్రతిసవాలు విసిరాడు.