సింగర్ సునీతకు హీరోయిన్ ఆఫర్లు
అవునూ.. సింగర్ సునీతకు హీరోయిన్ గా ఆఫర్లు వచ్చాయ్. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. ఇటీవలే సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ వీరపనేనిని పెళ్లాడింది. పెళ్లి తర్వాత ఓ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ.. నటిగా అవకాశాలు వచ్చిన విషయాన్ని తెలిపింది.
‘గులాబి’ సినిమాలో ‘ఈ వేళలో నీవు ఏంచేస్తు ఉంటావో.. ‘ అనే పాట హిట్టైన తర్వాత తనకు సినిమాల్లో నటించమని ఆఫర్లు వచ్చాయి. ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకుడు సైతం సినిమాల్లో నటించాలని కోరారు. అయితే హీరోయిన్ల కష్టాలను తాను స్వయంగా చూశాను. అందుకే నటిగా తనను తాను ఊహించుకోలేకపోయా.. నటన జోలికి వెళ్లలేదని తెలిపింది.