ఈ బాలుడి టాలెంట్ కి కేటీఆర్ ఫిదా


ఓ బాలుడు ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ క్రీడాకారుడి రేంజ్‌లో ప‌ల్టీలు కొడుతూ దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజ‌న్ తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, వి.శ్రీనివాస్ గౌడ్‌ల‌కు ట్వీట్ చేశాడు. బాలుడి టాలెంట్ పై మంత్రి కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అత‌డి గురించి వివ‌రాలు తెల‌పాలంటూ ట్వీట్ చేశారు. ఆ బాలుడికి అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌ని, ఇది త‌న సండే మోటివేష‌న్ గిఫ్ట్ అని పేర్కొన్నాడు.

ఈ వీడియోనే రీట్వీట్ చేసిన కేటీఆర్‌… ‘వావ్ ఒలింపిక్ మెడ‌లిస్ట్ త‌యార‌వుతున్నాడు. అత‌డు తెలంగాణ బాలుడా?  లేక దేశంలోని ఇత‌ర ప్రాంతానికి చెందినవాడా? గొప్ప నైపుణ్యాలు ఉన్న ఈ బాలుడిని ప్రోత్స‌హించాల‌నుకుంటున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. వీడియోలో బాలుడు.. చదును చేస్తున్న కొండపై ఉన్న మట్టిపై పల్టీలు కొట్టడం విశేషం. రాళ్లు, రప్పలున్న ప్రదేశంలోనే ఈ రేంజ్ లో పల్టీలు కొడితే.. మ్యాట్ పై మనోడు అద్భుతాలు చేయడం గ్యారెంటీ.