చూపులతోనే మత్తెక్కిస్తోంది !


యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లోని గడసు తనం గురించి తెలిసిందే. ‘అఆ’లో గడుసు మరదలుగా అద్భుతంగా నటించింది. ఇక ప్రేమకథ చిత్రాలకి అనుపమ కెరాఫ్ అడ్రస్. ఆమె చేసిన సినిమాలన్నీ దాదాపు ప్రేమకథలే. అలాగని ఎన్నడూ హద్దులు దాటలేదు. అయితే తొలిసారి మిడ్ నైట్ ఫ్రీడమ్ అనే షార్ట్ ఫిల్మ్ కోసం కాస్త బోల్డ్ గా నటించింది. ఇందులో చంద్ర పాత్రలో మత్తెక్కించే చూపులతో కట్టిపడేసింది.

తాజాగా చంద్ర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. కళ్లతో కసిగా చూస్తూ… కుర్రకారు గుండెళ్లని కొల్లగొడుతోంది. ఈ లఘు చిత్రానికి ఆర్ జే షాన్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ – హక్కిం షాజహాన్ జంటగా నటించారు. అఖిల్ మిధున్ నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది.ఇందులో చంద్ర పాత్రలో అనుపమ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.