బిగ్ బాస్ నటి ఆత్మహత్య

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ జయ శ్రీ రామయ్య ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరులోని తన నివాసంలో ఉరేసుకుని ఆమె ప్రాణాలు విడిచింది.

గత కొన్నాళ్లుగా ఆమె డిప్రెషన్స్ లో ఉందని.. డిప్రెషన్‌ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆ డిప్రెషన్స్ కారణాలు ఏంటీ ? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రేమ వ్యవహారాలా ? ఆర్థిక వ్యవహారాల అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.