రసమయి నిరసన గళం

తన ఆట-పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు రసమయి బాలకిషన్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయనకు తగిన ప్రాధాన్యం కూడా లభించింది. ఆయనకు ఒకటి కాదు.. రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కానీ ఎక్కడో ఓ మూలానా రసమయిలో అసంతృప్తి ఉంది. దాన్ని అప్పుడప్పుడు బయటికి తీస్తుంటాడు. గతంలో గులాభి జెండాకి అసలైన ఓనర్లమని సీనియర్ నాయకుడు, మంత్రి ఈటెల రాజేందర్ అన్నప్పుడు.. ఆయనకి రసమయి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత పలుమార్లు కూడా ఉద్యమకారులకి అన్యాయం జరుగుతోంది అన్నట్టుగా మాట్లాడారు. 

ఇక మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్న సమయంలో ఎమ్మెల్యే రసమయి షాకింగ్ కామెంట్స్ చేశారు.తెలంగాణ రాష్ట్రం వచ్చాక పాటలు కూడా మారిపోయాయ్. గళం మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమన్నారు. తెలంగాణలో ప్రతి గాయకుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. దీంతో రసమయి మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ ? ఆయనకు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదా ? అనే చర్చ మొదలైంది.