పంత్’లో పరిణతి పెరిగింది
రిషబ్ పంత్ – ప్రతిభగల ఆటగాడు. మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు. కానీ ఆటలో పరిణితి కనబర్చక ఇన్నాళ్లు విమర్శల పాలయ్యారు. అయితే ఆసీస్ టూర్ లో కొత్త పంత్ కనిపించాడు. పరిణతి కూడిన ఆటని కబర్చాడు. ఫలితంగా టెస్ట్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
దీనిపై స్పందించిన పంత్.. “2019 వన్డే ప్రపంచకప్ సెమీస్లో జట్టుకు అవసరమైన సమయంలో ఔటవడంతో గుండె పగిలినట్లనిపించింది. అలాంటి అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశా. నమ్మశక్యం కాని ప్రదర్శనతో కఠిన పరిస్థితుల్లో ఉన్న జట్టుకు విజయాలు సాధించాలని నేనెప్పుడూ కల కంటా. ఎన్ని పరుగులు చేశానన్నది ముఖ్యం కాదు. అవి జట్టు గెలుపునకు ఉపయోగపడ్డాయా? లేదా? అనేదే ప్రధానం.
బ్రిస్బేన్ టెస్టులో అందుకే చివరి వరకూ క్రీజులో ఉండాలనుకున్నా. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 97 పరుగులకు ఔటైనపుడు కూడా చివరి వరకూ నిలవలేకపోయానే అని బాధపడ్డా. అందుకే చివరి టెస్టులో మాత్రం ఆ పొరపాటు మళ్లీ చేయలేదు. ఇప్పుడు కాస్త పరిణతి సాధించానని అనిపిస్తోంది. నా ఆటతీరులో కొన్ని మార్పులు చేసుకున్నా. సానుకూల దృక్పథంతో ఉండి, కష్టపడితే కచ్చితంగా ఫలితం వస్తుంది” అని చెప్పుకొచ్చాడు.