#RRR రిలీజ్ డేటు చెప్పేశారు


‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు, మెగా, నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్. #RRR రిలీజ్ డేటుని చెప్పేశారు. ఈ యేడాది అక్టోబర్ 13న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ గుర్రంపై, తారక్ బుల్లెట్ పై దూసుకెళ్తున్నారు. ఫోస్టర్ ఓ రేంజ్ లో ఉంది.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. స్వాత్రంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య గల ఓ కామన్ పాయింట్ ఆధారంగా దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కథని రాసుకొన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక కొమరంభీమ్ పాత్రలో తారక్.. ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.

వాస్తవానికి ఈ యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న #ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. అయితే కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ వాయిదా పడటంతో.. #ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఎప్పుడు ? అన్నది సస్పెన్స్ గా మారింది. అసలు ఈ యేడాదియే ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాల్లేవ్. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావొచ్చనే ప్రచారనే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ తాజాగా రిలీజ్ డేటుపై ఆర్ ఆర్ ఆర్ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.