కేటీఆర్’కు సీఎం పదవి.. మూడ్నెళ్లు వాయిదా ?


మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడం ఖాయం. అదే కూడా వచ్చే నెలలోనే. ఫిబ్రవరి 18న ముహూర్తం ఫిక్సయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? కేటీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలని ఫిబ్రవరి లేదా మే నెలలో అప్పగిస్తారని సమాచారమ్. సీఎం కేసీఆర్ అనువైన కాలంలో కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఫిబ్రవరి 17న కేటీఆర్ పుట్టినరోజు. ఆ మరుసటి రోజేనే ఆయనకి పట్టాభిషేకం చేయనున్నట్టు చెబుతున్నారు. అయితే ఈలోగా పార్టీ, ప్రభుత్వ పరంగా కొన్ని పనులు చక్కబెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాటిలో ఏమైనా ఆలస్యం అయితే మే నెలలో తనయుడు పట్టాభిషేకాన్ని వాయిదా వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే తనయుడుకి సీఎం బాధ్యతలని అప్పగిస్తారని తెలుస్తోంది.