కాబోయే.. సీఎం కేటీఆర్ కోసం అత్యాధునిక కాన్వాయ్‌ !

ముఖ్యమంత్రి పదవి నుంచి కేటీఆర్ తప్పుకోబోతున్నారు. తనయుడు కేటీఆర్ కు పగ్గాలు అప్పగించనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 18న ముహూర్తం ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న కేటీఆర్ కోసం కొత్త కాన్వాయ్ సిద్ధమవుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల అవుతోంది.

కాబోయే.. సీఎం కేటీఆర్ కోసం టొయోటా కంపెనీకి చెందిన లాండ్ క్రూయిజర్ ఆర్మర్డ్ (ప్రాడో) వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం పది వాహనాలను సమకూర్చుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారుల సమాచారం. ఎనిమిది వాహనాలు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ అని, మరో రెండు రక్షణ అవసరాల కోసం వినియోగించేవని సూచనప్రాయంగా తెలుస్తోంది. ఈ వాహనాల కాన్వాయ్‌లో ఒకదానికి పేలుడు పదార్థాలను దూరం నుంచే కనిపెట్టగల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. మరో వాహనానికి మాత్రం అత్యవసర సమయాలలో వాహనం లోపలి నుంచే కాల్పులు జరపడానికి వీలుగా ‘వెపన్ మౌంటింగ్’ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం కలిగిన వాహనాలు కాబట్టి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి అనుమతి తప్పనిసరి అవసరం.