కేటీఆర్ కాబినేట్ లో మంత్రులెవరు ?

మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అందుకు ముహూర్తం కూడా ఫిక్సయింది. ఫిబ్రవరి 18న కేటీఆర్ కు పట్టాభిషేషం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేబినేట్’లో ఎవరెవరు ఉండబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలుత ప్రమాణస్వీకారం చేసిన సందర్భం లో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా తీసుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ ఇదే ఫార్ములాని ఫాలో కాబోతున్నట్టు సమాచారమ్. సీనియర్ నేత ఈటెల రాజేందర్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని తెలుస్తోంది. ఇక మరో డిప్యూటీ సీఎం పోస్ట్ ఎస్సీ వర్గానికి దక్కనుంది. ఇక కేటీఆర్, తలసానిలకు బెర్తులు ఖాయం. నిజామాబాద్ కోటాలో ఎమ్మెల్సీ కవితకు మంత్రి పదవి దక్కనుంది. విప్‌లలో బాల్కసుమన్‌, రేగాకాంతారావు, గువ్వల బాలరాజుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.