‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ ‘గని’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది.

సమ్మర్ లో గని ప్రేక్షకుల ముందుకు వస్తాడని అందరు భావించారు. కానీ సమ్మర్ కు సినిమాల తాకిడి ఎక్కువగా ఉండటంతో గని జులై కి వెళ్లాడు. జులై 30న గని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. ఎఫ్2, గద్దలకొండ గణేషి హిట్స్ తో వరుణ్ తేజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. గనితో పాటు వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.