కాశీ యాత్రకు బయలుదేరిన కేసీఆర్ కుటుంబం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కాశీ పర్యటనకు బయలుదేరారు. రెండ్రోజుల పాటు వీరి పర్యటన కొనసాగనుంది. ఈరోజు వారణాసి చేరుకోనున్నారు. అక్కడ అస్సి ఘాట్ నుంచి దశాశ్వమేథ ఘాట్ వరకూ పడవ ప్రయాణం చేయనున్నారు. ఆపై గంగా హారతిని, ప్రత్యేక పూజలను తిలకిస్తారు. అనంతరం సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయంలో కేసీఆర్ పూజలు చేసి, స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

రేపు కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించుకుని సీఎం కేసీఆర్ ప్రభుత్వం తిరుగు ప్రయాణం అవుతారని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కూతురు కవిత ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఫిబ్రవరిలోనే కేటీఆర్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈలోపు కేసీఆర్ సీఎం హోదాలో దైవ దర్శనాలు చేసుకోనున్నారని తెలుస్తోంది. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవమే ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ కు ఆఖరి రోజు. ఆ తర్వాత తనయుడు కేటీఆర్ కి పగ్గాలు అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతోంది.