పవన్ పక్కన నిధి.. నిజమా ?

గ్లామర్ హీరోయిన్ కి సరిపోయే అన్ని కొలతలు నిధి అగర్వాల్ సొంతం. ఆ అందాన్ని నమ్ముకొని నిధి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటుంది. సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హాట్ బ్యూటీ.. ‘మిస్టర్‌.మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి క్లాస్‌, మాస్‌ చిత్రాల్లో నటించింది. అయితే ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. తాజాగా ఈ బ్యూటీకి పవర్ ఫుల్ ఆఫర్ వచ్చిపడినట్టు సమాచారమ్.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ డ్రామాలో కథానాయికగా నటించే అవకాశాన్ని ఈ నటి దక్కించుకున్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇదే వార్తలు మరోసారి నెట్టింట్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఆమె షూట్‌లో పాల్గొందని.. సంక్రాంతి తర్వాత కొన్నిరోజులకే ఆ షెడ్యూల్‌ పూర్తి అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.