ప్రభాస్.. మరో బాలీవుడ్ సినిమా ఫిక్స్ !

బాహుబలి ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలని ప్రభాస్ చేయాల్సి ఉంది. తాజాగా మరో బాలీవుడ్ సినిమాకి ప్రభాస్ ఓకే చెప్పినట్టు సమాచారమ్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్ద్ ఆనంద్ చెప్పిన కథకి ప్రభాస్ ఓకే చెప్పారట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో  ‘బ్యాంగ్ బ్యాంగ్’‌, ‘వార్’ వంటి హై బడ్జెట్ సినిమాలొచ్చాయి.

ప్రస్తుతం ప్రస్తుతం సిద్ధార్ద్ .. షారూఖ్ ఖాన్, దీపిక పదుకొణే, జాన్ అబ్రహం కాంబినేషన్‌లో ‘పఠాన్’ అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత హృతిక్-దీపికా కాంబినేషన్‌లో ‘ఫైటర్’ అనే వార్ డ్రామా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ తో సిద్ధార్థ్ ఆనంద్ సినిమా ఉండనుందట. 2022 లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 2023లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది.