బ్యాట్’తో బంతి రొమాన్స్ మొదలైంది !


బ్యాట్’తో బంతి రొమాన్స్ మొదలైంది అంటోంది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఆమె ప్రధాన పాత్రలో టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ ‘షాబాష్ మిథు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తాప్సీ శిక్షణ మొదలైట్టింది. ఓ వైపు వేరే సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే.. ఖాళీ టైమ్ లో బ్యాటింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. కోచ్ నూషిన్ అల్ ఖాదీర్ ఆధ్వర్యంలో తాప్సీ క్రికెట్ లో శిక్షణ పొందుతోంది. తాజాగా శిక్షణ తీసుకుంటున్న ఫోటోలని తాప్సీ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటికి ఆసక్తికర కామెంట్ పెట్టింది.

“బ్యాట్ తో బంతి రొమాన్స్ మొదలైంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మంచి ప్రారంభంతో సగం పని పూర్తయినట్టే. ఈ మూవీ మరో మైలురాయి కానుంది. మా కెప్టెన్ కూల్ మిథాలి రాజ్.. షాభాష్ మిథు” అంటూ రాసుకొచ్చింది. ఈ చిత్రానికి ప్రియా అవెన్ స్క్రిప్ట్ అందించారు. రాహుల్ ధోలాఖియా దర్శత్వం వహించనున్నారు. వయాకామ్ 18 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం తాప్సీ ‘లూప్ లాపెటా’ షూటింగ్ లో బిజీగా ఉంది. ఆ తర్వాత షాభాష్ మిథు. హసీన్ దిల్ రూబా, రష్మి రాకెట్, దీపక్ సుందరాజన్ తమిళ చిత్రం, అనురాగ్ కశ్యప్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో నటించాల్సి ఉంది.