పాపం.. లిప్టులో ఇరుక్కుపోయిన అనసూయ !

యాంకర్, నటి అనసూయ భరధ్వాజ్ మళ్లీ ప్రెగ్నెంట్. అంతేకాదు.. ఆమె లిప్టులో ఇరుక్కుపోయారు. పురిటి నొప్పులతో తల్లడిల్లిపోతున్నారు. ఇదంతా అనసూయ తాజా చిత్రం ‘థ్యాంక్యూ బ్రదర్’ సినిమాలోని సీన్. విరాజ్‌ అశ్విన్‌తో కలిసి ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రమిది. రమేశ్‌ రాపర్తి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేశ్‌ విడుదల చేశారు.

ఉత్కంఠగా సాగిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఓ అపాయింట్ మెంట్ లో నివసించే ప్రియ(అనసూయ) నిండు గర్భిణి. ఒక రోజు లిఫ్ట్‌లో కిందకు వెళ్తుండగా సడెన్‌గా షార్ట్‌సర్క్యూట్‌ అవుతుంది. అదే లిఫ్ట్‌లో ఓ యువకుడు(విరాజ్‌) కూడా ఉంటాడు. అప్పుడే ప్రియకు నొప్పులు మొదలవుతాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం ట్రైలర్ చూపించారు. అప్పుడు ఆ యువకుడు ఏం చేశాడు? లిఫ్ట్‌ కదిలిందా? తెలియాలంటే ‘థ్యాంక్యూ బ్రదర్‌’ చూడాల్సిందే.