TS ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశారు. మే 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.

ఏప్రిల్‌ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష,  ఏప్రిల్‌ 3న  ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని  ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సుల పరీక్షలకూ ఇదే షెడ్యూల్‌ వర్తించనుంది. ఇక పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి నిర్వహించే అవకాశం ఉంది.